3
...

Featured Posts Coolbthemes

Uday

Wednesday, 5 November 2014

హైదరాబాద్ కోడలిగా..

హైదరాబాద్ కోడలిగా..


హైదరాబాద్ కోడలిగా..
ఇక్కడ పుట్టలేదు. ఇక్కడ గిట్టనూ లేదు. అయినా, ఆమె ఇక్కడి ప్రజలకు ప్రాతఃస్మరణీయురాలు. ఇది ఆమె మెట్టినిల్లు మాత్రమే. అయితే, ఇక్కడ ఆమె మాణిక్యంలా మెరిసింది. టర్కీలోని ఒటామన్ రాచకుటుంబంలో పుట్టిన ప్రిన్సెస్ నీలోఫర్, చివరి నిజాం రెండో కోడలిగా హైదరాబాద్ వచ్చింది. ఇస్తాంబుల్‌లోని గోజ్తెపె ప్యాలెస్‌లో 1916 జనవరి 4న పుట్టింది నీలోఫర్. అప్పటికి ఆమె తల్లి కుటుంబం ఒటామన్ రాజ్యాన్ని పాలిస్తుండేది.

తండ్రి దామాద్ మొరాలిజాదా సలారుద్దీన్ బే ఎఫెందీకి ఒటామన్ సంస్థానంలో ప్రముఖ స్థానం ఉండేది. నీలోఫర్ తల్లి అదిలే సుల్తాన్. ఆమె తండ్రి షెహజాదే మహమ్మద్ సెలాహద్దీన్. సుల్తాన్ ఐదో మురాద్ పెద్దకొడుకు ఆయన. ఒటామన్ రాజ్యానికి చివరి కాలిఫ్ సుల్తాన్ రెండో అబ్దుల్‌మసీద్.. నీలోఫర్‌కు మేనమామ. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఒటామన్ రాజ్యం పతనమైంది. ఒటామన్ వంశీయులందరూ టర్కీని వదిలి ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయారు. నీలోఫర్ తల్లిదండ్రులు సహా బంధువులందరూ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో స్థిరపడ్డారు.

నిజాం కోడలిగా భాగ్యనగరానికి..
చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రెండో కొడుకు మొజాంజాతో పెళ్లి తర్వాత నీలోఫర్ పదహారో ఏట హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. పెళ్లయిన చాలా ఏళ్లకు కూడా సంతానం కలగకపోవడంతో వైద్యుల సలహా కోసం యూరోప్ వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి నిజాం రాజ్యంలో నిపుణులైన ఆధునిక వైద్యులెవరూ లేరు. ప్రసవాలు ఇళ్లలోనే జరిగేవి. ప్రసూతి మరణాలు, శిశుమరణాలు ఎక్కువగా సంభవించేవి. ఈ పరిస్థితికి నీలోఫర్ తీవ్రంగా కలత చెందింది.

రాజ్యంలో వైద్య సౌకర్యాల కొరతను మామగారి దృష్టికి తీసుకువెళ్లింది. మహిళల కోసం, పిల్లల కోసం అధునాతన వసతులు ఉన్న ఆస్పత్రిని నిర్మించాల్సిన అవసరాన్ని వివరించింది. దీనికి స్పందించిన నిజాం రెడ్‌హిల్స్ ప్రాంతంలో ఆస్పత్రిని నిర్మించారు. దీనికి నీలోఫర్ పేరునే పెట్టారు. నగరంలో శిశువైద్యానికి నీలోఫర్ ఆస్పత్రి నేటికీ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటోందంటే, దానికి ప్రిన్సెస్ నీలోఫర్ చూపిన చొరవే కారణం.

నగరంలో నడయాడిన అందం..
నిజాం రాజ్యంలో రాచకుటుంబానికి చెందిన మహిళలంతా సాధారణంగా అంతఃపురాలకే పరిమితమయ్యే వారు. ప్రిన్సెస్ నీలోఫర్ మాత్రం వారందరికీ పూర్తిగా భిన్నమైన మహిళ. ఆమె తరచుగా నగర సంచారం చేసేది. విరివిగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేది. ధార్మిక, సేవా కార్యక్రమాలు, బహిరంగ కార్యక్రమాల్లోనే కాదు, రాత్రి పొద్దుపోయే వరకు జరిగే కాక్‌టెయిల్ పార్టీల్లోనూ పాల్గొనేది. నగర వీధుల్లో ఆమె సంచరిస్తుండేటప్పుడు ప్రజలంతా ఆమె అందాన్ని చకితులై తిలకించేవారు. అప్పట్లో ప్రపంచంలోనే తొలి పదిమంది అందగత్తెల్లో ఒకరిగా నీలోఫర్‌కు గుర్తింపు ఉండేది.

అంతర్జాతీయ మేగజైన్లు ఆమె ఫొటోను ముఖచిత్రంగా ప్రచురించేవి. పిల్లలు లేకపోవడంతో ఆమెకు సమయం భారంగా గడుస్తుండటంతోనే అత్తింటివారూ ఆమె పరిస్థితిని గుర్తించారు. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో నర్సింగ్‌లో శిక్షణ తీసుకునేలా నిజాం ఆమెను ప్రోత్సహించారు. శిక్షణ తర్వాత ఆమె నగరంలోని సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నీలోఫర్‌కు ఇంకా పిల్లలు కలగకపోవడంతో మొజాంజా రెండో పెళ్లి చేసుకున్నారు. భర్తతో పొరపొచ్చాలు రావడంతో 1952లో నీలోఫర్ విడాకులు తీసుకున్నారు.

ఫ్రాన్స్‌లో చివరి రోజులు..
మొజాంజాతో విడాకుల తర్వాత నీలోఫర్ తమ పుట్టింటివారు స్థిరపడ్డ ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. అక్కడే ఆమె మాజీ బ్రిటిష్ దౌత్యవేత్త ఎడ్వర్డ్ జూలియస్ పోప్‌ను 1963లో పెళ్లాడారు. రెండో పెళ్లి తర్వాత ఫ్రాన్స్‌లో ఆమె చురుకైన సామాజిక జీవితాన్నే గడిపారు. వార్ధక్యంలో అనారోగ్యానికి గురై, 1989 జూన్ 12న నీలోఫర్ పారిస్‌లో తుదిశ్వాస విడిచారు.
 

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ 2014

                     తెలంగాణ బడ్జెట్ హైలైట్స్


                                     
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.

బడ్జెట్ ప్రధాన అంశాలు :

* తెలంగాణ జర్నలిస్టుల భవన్ కు కి రూ.10 కోట్లు కేటాయింపు
*  ఆటోలపై రవాణా పన్ను రద్దు
* బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి మూడున్నర లక్షల కేటాయింపు
* దీపం పథకానికి రూ.100 కోట్లు
*దళితుల భూపంపిణీకి రూ.1000 కోట్లు
* సాంస్కృతిక, క్రీడారంగానికి రూ.1000 కోట్లు

*విద్యాశాఖలోని అన్ని విభాగాలకు రూ.10,956 కోట్లు కేటాయింపు
*వ్యవసాయం, రుణమాఫీ కోసం ఇప్పటికే రూ.4,250 కోట్లు కేటాయింపు
*మిగతా నిధులను వచ్చే మూడేళ్లలో దశలవారీగా చెల్లింపు
*ఇన్ పుట్ సబ్సిడీ రూ.480 కోట్లు ఇప్పటికే చెల్లింపు
* ఉద్యానవన శాఖకు రూ.250 కోట్లు కేటాయింపు
* వ్యవసాయ రంగంలో యంత్రీకరణకు రూ.100 కోట్లు

* వికలాంగుల పెన్షన్ ను రూ.500 నుంచి 1500లకు పెంపు
* వృద్ధులు, వితంతువుల పెన్షన్ రూ.200 నుంచి రూ.1000 పెంపు
* మహిళా శిశు సంక్షేమానికి రూ.221 కోట్లు, ఐసిడీఎస్ పథకానికి రూ.1103 కోట్లు
* బీసీల సంక్షేమానికి రూ.2022 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు
* ఎస్సీల సబ్ ప్లాన్ కు రూ.7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు రూ.4559 కోట్లు
* 2014-19 వరకు ఎస్సీల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వ లక్ష్యం
* కళ్యాణ లక్ష్మీ (ఎస్సీ) పథకానికి రూ.150 కోట్లు, కళ్యాణ లక్ష్మీ (ఎస్టీ) పథకానికి రూ.80కోట్లు కేటాయింపు
* మైనార్టీలకు (షాదీ ముబారక్) రూ.100 కోట్లు

* రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లాలకు డబుల్ రోడ్లకు రూ.400 కోట్లు
* ఈ ఏడాది 9వేల చెరువులకు రూ.2వేల కోట్ల కేటాయింపు
*తెలంగాణలో దెబ్బతిన్న 45వేల చెరువులను పునరుద్ధరిస్తాం
* తెలంగాణ 10 జిల్లాల్లో తలసరి ఆదాయం ఒక్కోచోట ఒక్కోలా ఉంది
* 50 ఏళ్లుగా తెలంగాణపై చేసిన పరోక్ష పెత్తనం... ఈప్రాంతాన్ని వెనుకబడేలా చేసింది

* విద్యుత్ రంగానికి మొత్తం రూ.3241 కోట్లు
* ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.కోటిన్నర, మొత్తం రూ.234 కోట్ల కేటాయింపు
* వచ్చే అయిదేళ్లలో 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యం
* ఎన్టీపీసీ ద్వారా అదనంగా 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు
* 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం జెన్ కోలో రూ.1000 కోట్ల పెట్టుబడి

*రూ.లక్షా 637 కోట్ల 10 నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటెల రాజేందర్
*ప్రణాళిక వ్యయం రూ.48, 648 కోట్లు
*ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు
*రెవెన్యూ మిగులు అంచనా రూ.301 కోట్లు
*ఆర్థిక లోటు అంచనా రూ.17,398 కోట్లు

* రహదారుల అభివృద్ధికి 10వేల కోట్లు
* రైతులకు సోలార్ పంపు సెట్ల కోసం రూ.200 కోట్లు
*గృహ నిర్మాణం 1000 కోట్లు
* వాటర్ గ్రిడ్ లకు రూ.2వేల కోట్ల కేటాయింపు
* నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
* 459మంది అమరవీరుల ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం
* పథకాల అమలులో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే సమగ్ర సర్వే

* నల్లగొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ శాపంగా మారింది
* బంగారు తెలంగాణ లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన
* ఉద్యమ భవిష్యత్ అందించేలా బడ్జెట్
* ఈ బడ్జెట్ పది నెలలకు సంబంధించినది మాత్రమే
* అన్నివర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
* అమరవీరులకు పరిహారం కోసం బడ్జెట్ లో రూ.100 కోట్లు

Tuesday, 4 November 2014

ఢిల్లీలో తిరిగి అధికారం సాధిస్తాం : కేజ్రీవాల్


ఢిల్లీలో తిరిగి అధికారం సాధిస్తాం : కేజ్రీవాల్


ఢిల్లీలో తిరిగి అధికారం సాధిస్తామన్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. త్వరలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి 45కు పైగా సీట్లు వస్తాయన్నారు. 49 రోజుల పాటు మంచి పాలన అందించిన ట్రాక్ రికార్డ్ ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఆప్ 49రోజుల పాలన ఐదేళ్ల పాటు ఉండాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
కేజ్రీవాల్ స్పీచ్ లో హైలెట్స్…
  • 49 రోజుల పాలనలో అవినీతి, ధరలను అదుపులో ఉంచాం.
  • ఢిల్లీని దేశంలోనే అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తాం.
  • ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ఉంటుంది.
  • ఎన్నికల్లో ఆలస్యానికి బీజేపీదే బాధ్యత.
  • కరెంట్, అవినీతిపై పోరాడే సీఎంను ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు.
  • మా పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ ప్రయత్నించింది.

బ్రేకింగ్ న్యూస్: టిఆర్ఎస్ లో విలీనం దిశ గా టిడిపి అడుగులు

బ్రేకింగ్ న్యూస్: టిఆర్ఎస్ లో విలీనం దిశ గా టిడిపి అడుగులు



తెలుగుదేశం పార్టీ తెలంగాణ పైన అనుసరిస్తున్న వైఖరి ఫై కలత చెంది తెరాస లో చేరిన  5  శాసనమండలి సభ్యులు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు వారు ఒక లేఖ ఇవ్వాలని ఆలోచనకు వచ్చారని కధనం. తెలంగాణ శాసనమండలిలో ఏడుగురు ఎమ్మెల్సీలు టిడిపికి ఉన్నారు.వారిలో ఐదుగురు గుడ్ బై చెప్పారు. నిజామాబాద్ కు చెందిన నర్సారెడ్డి,ఖమ్మం జిల్లా కు చెందిన పోట్ల నాగేశ్వరరావు మాత్రమే పార్టీలో ఉన్నారు.బొడకుంటి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ,నరేంద్ర రెడ్డి ప్రభృతులు పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరిపై అనర్హత వేటు వేయాలని టిడిపి కౌన్సిల్ చైర్మన్ ను కోరింది. అయితే మెజార్టీ సభ్యులు తమవైపే ఉన్నందున పార్టీ తమదేనని, అందువల్ల పార్టీని విలీనం చేస్తున్నామని వారంతా ఒక లేఖ ఇవ్వనునునట్లు సమాచారం.   ఈ వార్త నిజమే  అయితే తెలంగాణ లో విద్యుత్ సమస్యలను సృష్టిస్తున్న టీడిపి ని శాశ్వతంగా తెలంగాణ నుండి వేలేయడం తో  పాటు రాశాతనికి కి కూడా  మేలు జరుగుతుందని ఇది తెలంగాణ రాష్టానికి  ఇది మరో శుభవార్త  అవుతుందని బావిస్తునట్లు సమాచారం.

లబోదిబో అంటున్న కాంగ్రెస్

లబోదిబో అంటున్న కాంగ్రెస్




పార్టీనీ వీడుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా దూమారం రేపుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణ లో అధికారంలోకి రాకపోవడం ఆ పార్టీని ఆందోళనకు గు రిచేస్తుంటే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అధి కార పక్షంలో చేరడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని ఏఐసిసి ప్రధాన రామచందర్‌ కుంతియా స్వయంగా టి సిఎల్‌పి సమావేశంలో వెల్లడించారు. టి అ సెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీని వీడిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వ్యవహారంపై చర్చిం చేందుకు సోమవారం నాడు టి సిఎల్‌పి సమావేశం జరి గింది. ఈ సమావేశంలో పార్టీ హైకమాండ్‌ దూతగా రామ చందర్‌ కుంతియా, టి పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మ య్య,సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, మండలి కాంగ్రెస్‌ పక్ష నేత డి.శ్రీనివాస్‌, ఉపనేత మహ్మద్‌ అలీషబ్బీర్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీని వీడిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గురించి చర్చకు వచ్చి నట్లు సమాచారం. దీనిపై స్పందించిన రామచందర్‌ కుంతి యా ఈ వ్యవహారంపై సోనియాగాంధీ చాలా కలత చెందా రని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక తెలంగాణ రాషా్టన్న్రి ఇచ్చినా పార్టీ అక్కడ అధికారంలోకి రాలేకపో యిందని సోనియాగాంధీ ఆవేదన వ్యక్తంచేశారని ఆయన వెల్లడించారు. అధికారంలోకి రాలేదు సరేపార్టీ నుంచి గెలి చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సైతం పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరడం ఏమిటీ అని ఆమె చాలా బాధతో ఉన్నారని, ఆ పరి స్థితిని నివారించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్న ట్లు తెలిసిం

Monday, 22 September 2014

Maharashtra polls: Amit Shah calls Uddhav Thackeray on seat sharing By Agencies |Posted 22-Sep-2014


New Delhi: BJP president Amit Shah Monday called Shiv Sena chief Uddhav Thackeray and urged him to reconsider his stand on seat sharing in upcoming Maharashtra poll.
The two parties, which have been alliance partners for nearly 25 years, hit a rough patch over seat sharing for Oct 15 Maharashtra assembly polls.
Amit Shah and Uddhav ThackerayAmit Shah and Uddhav Thackeray
Sources within the BJP said that Shah called Thackeray Monday morning, and said that the ties between the two parties should not break.
While the Bharatiya Janata Party (BJP) wants at least 135 seats to contest, Shiv Sena is not ready to offer anything more than 119 seats in the 288-seat assembly.
The last date for filing nominations is Sep 27.
BJP sources said Monday that they may soon decide on candidates.
Asked about the chances of the alliance breaking up, BJP spokesperson Syed Shahnawaz Hussain said: "The decision will be announced soon."