3

Tuesday, 4 November 2014

బ్రేకింగ్ న్యూస్: టిఆర్ఎస్ లో విలీనం దిశ గా టిడిపి అడుగులు

బ్రేకింగ్ న్యూస్: టిఆర్ఎస్ లో విలీనం దిశ గా టిడిపి అడుగులు



తెలుగుదేశం పార్టీ తెలంగాణ పైన అనుసరిస్తున్న వైఖరి ఫై కలత చెంది తెరాస లో చేరిన  5  శాసనమండలి సభ్యులు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు వారు ఒక లేఖ ఇవ్వాలని ఆలోచనకు వచ్చారని కధనం. తెలంగాణ శాసనమండలిలో ఏడుగురు ఎమ్మెల్సీలు టిడిపికి ఉన్నారు.వారిలో ఐదుగురు గుడ్ బై చెప్పారు. నిజామాబాద్ కు చెందిన నర్సారెడ్డి,ఖమ్మం జిల్లా కు చెందిన పోట్ల నాగేశ్వరరావు మాత్రమే పార్టీలో ఉన్నారు.బొడకుంటి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ,నరేంద్ర రెడ్డి ప్రభృతులు పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరిపై అనర్హత వేటు వేయాలని టిడిపి కౌన్సిల్ చైర్మన్ ను కోరింది. అయితే మెజార్టీ సభ్యులు తమవైపే ఉన్నందున పార్టీ తమదేనని, అందువల్ల పార్టీని విలీనం చేస్తున్నామని వారంతా ఒక లేఖ ఇవ్వనునునట్లు సమాచారం.   ఈ వార్త నిజమే  అయితే తెలంగాణ లో విద్యుత్ సమస్యలను సృష్టిస్తున్న టీడిపి ని శాశ్వతంగా తెలంగాణ నుండి వేలేయడం తో  పాటు రాశాతనికి కి కూడా  మేలు జరుగుతుందని ఇది తెలంగాణ రాష్టానికి  ఇది మరో శుభవార్త  అవుతుందని బావిస్తునట్లు సమాచారం.

0 comments:

Post a Comment