హైదరాబాద్ కోడలిగా..

ఇక్కడ పుట్టలేదు. ఇక్కడ గిట్టనూ లేదు. అయినా, ఆమె ఇక్కడి ప్రజలకు ప్రాతఃస్మరణీయురాలు. ఇది ఆమె మెట్టినిల్లు మాత్రమే. అయితే, ఇక్కడ ఆమె మాణిక్యంలా మెరిసింది. టర్కీలోని ఒటామన్ రాచకుటుంబంలో పుట్టిన ప్రిన్సెస్ నీలోఫర్, చివరి నిజాం రెండో కోడలిగా హైదరాబాద్ వచ్చింది. ఇస్తాంబుల్‌లోని గోజ్తెపె ప్యాలెస్‌లో 1916 జనవరి 4న పుట్టింది నీలోఫర్. అప్పటికి ఆమె తల్లి కుటుంబం ఒటామన్ రాజ్యాన్ని పాలిస్తుండేది.
తండ్రి దామాద్ మొరాలిజాదా సలారుద్దీన్ బే ఎఫెందీకి ఒటామన్ సంస్థానంలో ప్రముఖ స్థానం ఉండేది. నీలోఫర్ తల్లి అదిలే సుల్తాన్. ఆమె తండ్రి షెహజాదే మహమ్మద్ సెలాహద్దీన్. సుల్తాన్ ఐదో మురాద్ పెద్దకొడుకు ఆయన. ఒటామన్ రాజ్యానికి చివరి కాలిఫ్ సుల్తాన్ రెండో అబ్దుల్‌మసీద్.. నీలోఫర్‌కు మేనమామ. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఒటామన్ రాజ్యం పతనమైంది. ఒటామన్ వంశీయులందరూ టర్కీని వదిలి ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయారు. నీలోఫర్ తల్లిదండ్రులు సహా బంధువులందరూ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో స్థిరపడ్డారు.
నిజాం కోడలిగా భాగ్యనగరానికి..
చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రెండో కొడుకు మొజాంజాతో పెళ్లి తర్వాత నీలోఫర్ పదహారో ఏట హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. పెళ్లయిన చాలా ఏళ్లకు కూడా సంతానం కలగకపోవడంతో వైద్యుల సలహా కోసం యూరోప్ వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి నిజాం రాజ్యంలో నిపుణులైన ఆధునిక వైద్యులెవరూ లేరు. ప్రసవాలు ఇళ్లలోనే జరిగేవి. ప్రసూతి మరణాలు, శిశుమరణాలు ఎక్కువగా సంభవించేవి. ఈ పరిస్థితికి నీలోఫర్ తీవ్రంగా కలత చెందింది.
రాజ్యంలో వైద్య సౌకర్యాల కొరతను మామగారి దృష్టికి తీసుకువెళ్లింది. మహిళల కోసం, పిల్లల కోసం అధునాతన వసతులు ఉన్న ఆస్పత్రిని నిర్మించాల్సిన అవసరాన్ని వివరించింది. దీనికి స్పందించిన నిజాం రెడ్‌హిల్స్ ప్రాంతంలో ఆస్పత్రిని నిర్మించారు. దీనికి నీలోఫర్ పేరునే పెట్టారు. నగరంలో శిశువైద్యానికి నీలోఫర్ ఆస్పత్రి నేటికీ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటోందంటే, దానికి ప్రిన్సెస్ నీలోఫర్ చూపిన చొరవే కారణం.
నగరంలో నడయాడిన అందం..
నిజాం రాజ్యంలో రాచకుటుంబానికి చెందిన మహిళలంతా సాధారణంగా అంతఃపురాలకే పరిమితమయ్యే వారు. ప్రిన్సెస్ నీలోఫర్ మాత్రం వారందరికీ పూర్తిగా భిన్నమైన మహిళ. ఆమె తరచుగా నగర సంచారం చేసేది. విరివిగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేది. ధార్మిక, సేవా కార్యక్రమాలు, బహిరంగ కార్యక్రమాల్లోనే కాదు, రాత్రి పొద్దుపోయే వరకు జరిగే కాక్‌టెయిల్ పార్టీల్లోనూ పాల్గొనేది. నగర వీధుల్లో ఆమె సంచరిస్తుండేటప్పుడు ప్రజలంతా ఆమె అందాన్ని చకితులై తిలకించేవారు. అప్పట్లో ప్రపంచంలోనే తొలి పదిమంది అందగత్తెల్లో ఒకరిగా నీలోఫర్‌కు గుర్తింపు ఉండేది.
అంతర్జాతీయ మేగజైన్లు ఆమె ఫొటోను ముఖచిత్రంగా ప్రచురించేవి. పిల్లలు లేకపోవడంతో ఆమెకు సమయం భారంగా గడుస్తుండటంతోనే అత్తింటివారూ ఆమె పరిస్థితిని గుర్తించారు. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో నర్సింగ్‌లో శిక్షణ తీసుకునేలా నిజాం ఆమెను ప్రోత్సహించారు. శిక్షణ తర్వాత ఆమె నగరంలోని సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నీలోఫర్‌కు ఇంకా పిల్లలు కలగకపోవడంతో మొజాంజా రెండో పెళ్లి చేసుకున్నారు. భర్తతో పొరపొచ్చాలు రావడంతో 1952లో నీలోఫర్ విడాకులు తీసుకున్నారు.
ఫ్రాన్స్‌లో చివరి రోజులు..
మొజాంజాతో విడాకుల తర్వాత నీలోఫర్ తమ పుట్టింటివారు స్థిరపడ్డ ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. అక్కడే ఆమె మాజీ బ్రిటిష్ దౌత్యవేత్త ఎడ్వర్డ్ జూలియస్ పోప్‌ను 1963లో పెళ్లాడారు. రెండో పెళ్లి తర్వాత ఫ్రాన్స్‌లో ఆమె చురుకైన సామాజిక జీవితాన్నే గడిపారు. వార్ధక్యంలో అనారోగ్యానికి గురై, 1989 జూన్ 12న నీలోఫర్ పారిస్‌లో తుదిశ్వాస విడిచారు.

.jpg)